గుడ్ న్యూస్.. వేడి వాతావరణంలో బలహీన పడుతున్న కరోనా వైరస్!
- మన దేశంలోని అధిక ఉష్ణోగ్రతలు వైరస్ ను కట్టడి చేస్తాయి
- అయితే సోషల్ డిస్టెన్స్ ను పాటించడమే మెరుగైన ఆయుధం
- కేరళ ప్రభుత్వం మంచి ఫలితాలను సాధించడానికి ఇదే కారణం
కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్న భారతీయులకు ఇది ఎంతో ఊరటను ఇచ్చే వార్త. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కరోనా వైరస్ మనుగడ సాగించడం కష్టమవుతోందని భారత శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గుర్తించారు. మన దేశంలోని అధిక ఉష్ణోగ్రతలు వైరస్ నియంత్రణను కట్టడి చేస్తాయని వారు తేల్చారు. అయితే, వాతావరణ పరిస్థితులతో పోలిస్తే... భౌతిక దూరాన్ని పాటించడమే కీలక ఆయుధమని చెప్పారు. నాగపూర్ లోని జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
సాధారణంగా వైరస్ లు అధిక ఉష్ణోగ్రతల వద్ద బలహీనపడతాయని... కరోనా వైరస్ కూడా దీనికి అతీతం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, స్వీయ నియంత్రణ, సామాజిక దూరాన్ని పాటించడం వంటి వాటితో మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని చెప్పారు. ఈ వ్యూహాలను పక్కాగా అమలు చేయడం వల్లే కేరళ ప్రభుత్వం అద్భుతమైన ఫలితాలను సాధించిందని తెలిపారు.