రిషికపూర్ ఇకలేరు.. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాలీవుడ్!

  • ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రిషి కపూర్ మృతి
  • గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్న నట దిగ్గజం
  • తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు
బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 67 ఏళ్లు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ముంబైలోని ఆసుపత్రిలో చేరిన రిషి కపూర్... చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.

ఆయనకు భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్ బీర్ కపూర్, కుమార్తె రిద్ధిమా కపూర్ ఉన్నారు. రిషి మరణ వార్తతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News