మత్తు కోసం రసాయన ద్రావణంలో నీరు కలుపుకుని తాగి ఇద్దరి మృతి
- యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
- రసాయనం స్పిరిట్ వాసన రావడంతో తాగిన వైనం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
మద్యం అలవాటున్న ఇద్దరు వ్యక్తులు మత్తు కోసం రసాయన ద్రావణంలో నీళ్లు కలుపుకుని తాగి ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన షేక్‌బాబా (35), రియాజ్ (22)లు ప్లాస్టిక్ బొమ్మలు విక్రయిస్తూ జీవిస్తుంటారు.
మంగళవారం రాత్రి వీరిద్దరూ ప్లాస్టిక్ డ్రమ్మును శుభ్రం చేసేందుకు రసాయన ద్రావణాన్ని ఉపయోగించారు. ఈ క్రమంలో అది స్పిరిట్ వాసన రావడంతో మత్తు కలిగిస్తుందన్న ఉద్దేశంతో అందులో నీళ్లు కలుపుకుని తాగారు. నిన్న ఉదయం వీరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.