దేశంలో ఉగ్రదాడులకు తీహార్ జైలులో కుట్ర పన్నిన హైదరాబాద్ ఉగ్రవాది

  • ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ రెండేళ్ల క్రితం పోలీసులకు చిక్కిన అనుమానిత ఉగ్రవాది
  • కేసుల తీవ్రత దృష్ట్యా అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
  • సీఏఏ అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన జంటను విచారించగా కుట్ర వెలుగులోకి
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ అనుమానిత ఉగ్రవాది తీహార్ జైలులో ఉంటూ దేశంలో దాడులకు కుట్ర పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ 2018లో మహారాష్ట్రలోని ఓ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కిన అతడిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోగా, కేసు తీవ్రత కారణంగా జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని తీహార్ జైలుకు తరలించింది. జైల్లో ఉంటూనే ఓ వర్గం యువతకు ఉగ్రపాఠాలు బోధిస్తూ దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్టు తేలడంతో సమాచారాన్ని తెలంగాణ పోలీసులకు ఎన్ఐఏ అందించింది.

సీఏఏ వ్యతిరేక ఆందోళనల ద్వారా దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నారన్న అభియోగంపై ఐసిస్ ఇరాన్ ఖొరాసన్ మాడ్యూల్‌కు చెందిన జహంజేబ్ సమీ, హింద్రా బషీర్‌బేగ్ జంటను గత నెల 8న ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంటను విచారించగా హైదరాబాద్ పాతబస్తీకి సంబంధించిన ఉగ్రవాది సమాచారం వెల్లడైంది. దీంతో అతడిని విచారించగా కుట్ర బాగోతం వెలుగులోకి వచ్చింది.


More Telugu News