ఆ పన్నును కనీసం 9 నెలలు వాయిదా వేయండి: అంతర్జాతీయ వ్యాపార సంఘాల అభ్యర్థన

  • ఈక్వలైజేషన్ లెవీ వసూలును వాయిదా వేయండి
  • ‘సెక్షన్ 165ఎ’ అమల్లోనూ తొందరొద్దు
  • ఆర్థిక మంత్రికి రాసిన సంయుక్త లేఖలో అభ్యర్థన
  ఇ-కామర్స్ సంస్థలపై విధిస్తున్న రెండు శాతం పన్నును ప్రస్తుత సంక్షోభ సమయంలో 9 నెలలపాటు వాయిదా వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను అభ్యర్థిస్తూ అంతర్జాతీయ వ్యాపార సంఘాలు  లేఖ రాశాయి. ఈ అంతర్జాతీయ బాడీలో వాల్‌మార్ట్, అమెజాన్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్ తదితర దిగ్గజ సంస్థలు ఉన్నాయి. కోవిడ్-19 కారణంగా ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఈక్వలైజేషన్ లెవీ రెండు శాతాన్ని కనీసం 9 నెలలపాటు వాయిదా వేయాలని కోరాయి.

యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్, జపాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ అసోసియేషన్, ఆసియా-పసిఫిక్ ఎంఎస్ఎంఈ ట్రేడ్ కొయిలేషన్ అండ్ డిజిటల్ యూరప్ వంటి తొమ్మిది వ్యాపార సంఘాలు ఆర్థిక మంత్రికి రాసిన సంయుక్త లేఖలో ఈ మేరకు డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ నిబద్ధత స్ఫూర్తితోనే ఈ లేఖను రాస్తున్నట్టు పేర్కొన్న సంఘాలు.. ఈక్వలైజేషన్ లెవీని, కేంద్ర బడ్జెట్‌లో  ‘సెక్షన్ 165ఎ’ అమలును కనీసం 9 నెలలపాటు వాయిదా వేయాలని కోరాయి.


More Telugu News