ఈ ఆరు ప్రాజెక్టులు ఈ ఏడాదే ప్రారంభమవుతాయని సీఎం జగన్ కు వివరించిన అధికారులు

  • లాక్ డౌన్ తో పనులకు తీవ్ర అంతరాయం
  • ఈ నెల 20 నుంచి పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి
  • ఈ విషయాలను జగన్ కు చెప్పిన అధికారులు
పోలవరం ప్రాజెక్టు పనులపై ఏపీ సీఎం జగన్  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ‘కరోనా’, ‘లాక్ డౌన్’ నేపథ్యంలో సిమెంట్, స్టీల్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, నెల రోజులకు పైగా సమయం వృథా అయిందని జగన్ కు అధికారులు తెలిపారు.

ఈ నెల 20 నుంచి పరిస్థితులు కొంత మేరకు మెరుగుపడటంతో, ఇప్పుడిప్పుడే, సిమెంట్, స్టీల్ సరఫరా మొదలువుతున్న విషయాన్ని జగన్ దృష్టికి తెచ్చారు. సిమెంట్, స్టీల్ సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూడాలని, పోలవరం స్పిల్ వే పనులు జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని , ప్రాజెక్టు పనులకు సంబంధించి సూక్ష్మ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ఈ సందర్భంగా అవుకు టన్నెల్-2, వెలిగొండ, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్, వంశధార-నాగావళి ప్రాజెక్టుల పనులపైనా జగన్ సమీక్షించారు.  2020లోనే ‘పోలవరం’ తోపాటు ఈ ఐదు ప్రాజెక్టులు ప్రారంభం అవుతాయని జగన్ కు అధికారులు తెలిపారు.


More Telugu News