కర్ఫ్యూను మరో రెండు వారాలు పొడిగించిన పంజాబ్

  • ఉదయం 7 నుంచి 11 గంటల వరకు సడలింపు
  • ఆ సమయంలోనే నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవాలన్న సీఎం
  • లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఊహాగానాలు
కరోనాపై పోరులో భాగంగా పంజాబ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అమల్లో ఉన్న కర్ఫ్యూను మరో రెండు వారాలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు సడలిస్తామని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు. ఆ సమయంలో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవచ్చని, దుకాణదారులు తమ షాపులను తెరుచుకోవచ్చని పేర్కొన్నారు.

కాగా, వచ్చే నెల 3తో రెండో దఫా లాక్‌డౌన్ గడువు ముగియనుండగా, మరింతకాలం పొడిగించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు సీఎంలు లాక్‌డౌన్ పొడిగించాలని కోరిన సంగతి విదితమే. ప్రస్తుతం లాక్‌డౌన్ కఠినంగా అమలవుతున్నప్పటికీ కొత్త కేసులు వెలుగు చూస్తుండడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.


More Telugu News