గుజరాత్ నుంచి వచ్చే మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.2 వేలు ఇవ్వండి: సీఎం జగన్ ఆదేశాలు
- మత్స్యకారులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం
- ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశం
- కొవిడ్-19 నివారణా చర్యలపై జగన్ సమీక్ష
గుజరాత్ లో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులు తిరిగి వారి స్వస్థలాలకు బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ అంశం గురించి ఏపీ సీఎం జగన్ తాజాగా ప్రస్తావించారు. కొవిడ్-19 నివారణా చర్యలు, ప్రభావిత రంగాల పరిస్థితులపై జగన్ ఇవాళ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుజరాత్ నుంచి మత్స్యకారులు తిరిగి రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గడచిన ఇరవై నాలుగు గంటలలో ఏపీలో 73 కేసులు నమోదయ్యాయని జగన్ కు అధికారులు తెలిపారు. గుంటూరులో నమోదైన 29 కేసుల్లో 27 కేసులు నరసరావుపేటకు చెందినవేనని తెలిపారు.