మే నెలాఖరు వరకు ఆంక్షలు కొనసాగించాల్సిందేననేది నిపుణుల అభిప్రాయం: మమతా బెనర్జీ
- కొన్ని దేశాలు లాక్ డౌన్ ఆంక్షలు పొడిగించాయి
- కేంద్రం సూచనల మేరకు కొన్నింటికి మినహాయింపులు
- గ్రీన్ జోన్లలో తగు జాగ్రత్తలతో షాపులు తెరచుకోవచ్చు
పశ్చిమ బెంగాల్ లో మే నెలాఖరు వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగించాల్సిందేనని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మే చివరి వరకూ కానీ, జూన్ మొదటి వారాంతం వరకు కానీ లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కేంద్రం సూచనల మేరకు కొన్నింటికి మినహాయింపులు కొనసాగుతాయని చెప్పారు. రాష్ట్రంలోని గ్రీన్ జోన్లలో తగు జాగ్రత్తలతో షాపులు తెరచుకోవచ్చని తెలిపారు.