డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. ట్విట్టర్‌లో మోదీని అన్‌ఫాలో చేసిన వైనం!

  • ఇటీవల మోదీ ఖాతాను ఫాలో అవడం మొదలెట్టిన వైట్‌హౌస్
  • అన్‌ఫాలో చేసి సరికొత్త చర్చకు తెరలేపిన యూఎస్
  • భారత్-అమెరికా సంబంధాలపై కొత్త చర్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ భారత ప్రధాని నరేంద్రమోదీని తన ట్విట్టర్ ఖాతా నుంచి అన్‌ఫాలో చేయడం సంచలనమైంది. కొన్ని రోజుల క్రితం వైట్‌హౌస్ ట్విట్టర్ హ్యాండిల్.. భారత ప్రధాని మోదీ, ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు పలు ట్విట్టర్ ఖాతాలను ఫాలో అయింది. ఫలితంగా వైట్‌హౌస్ ఫాలో అవుతున్న వాటి సంఖ్య 19కి పెరిగింది. అయితే, అంతలోనే ఏమైందో కానీ ఇప్పుడు వీటన్నింటినీ అన్‌ఫాలో చేసింది. దీంతో శ్వేతసౌధం ఫాలో అవుతున్న ఖాతాల సంఖ్య 13కు పడిపోయింది. వైట్‌హౌస్ తాజా చర్యతో భారత్-అమెరికా బంధంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.


More Telugu News