బెంగళూరు నుంచి 22 విమానాల ద్వారా 3 వేల మంది విదేశీయుల తరలింపు!
- లాక్ డౌన్ కారణంగా భారత్ లో చిక్కుకుపోయిన విదేశీయులు
- మార్చి 31న జర్మనీకి బయల్దేరిన తొలి విమానం
- మొత్తం 17 దేశాలకు విదేశీయుల తరలింపు
కరోనా విస్తరణను కట్టడి చేయడంలో భాగంగా విమాన ప్రయాణాలపై ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక మంది విదేశీయులు మన దేశంలోనే ఇరుక్కుపోయారు. వీరిలో 3 వేల మందిని వారి దేశాలకు పంపించి వేసినట్టు అధికారులు తెలిపారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి మొత్తం 22 విమానాల ద్వారా 17 దేశాలకు విదేశీయులను తరలించినట్టు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.
విదేశీయులతో కూడిన తొలి విమానం మార్చి 31న జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు వెళ్లిందని అధికారులు తెలిపారు. ఈ విమానంలో వెళ్లినవారిలో ఎక్కువ మంది టోక్యోకు చెందినవారు ఉన్నారని చెప్పారు. లండన్, మాలె, మస్కట్, దోహా, కొలంబో, కైరో, బాగ్దాద్, అజర్బైజాన్, ఇంచేన్, రోమ్, స్టాక్ హోమ్, రియాద్, పారిస్, పరొ తదితర నగరాలకు విమానాలు వెళ్లాయని తెలిపారు. వీటిలో ఇంచేన్, రోమ్, పరొ, కైరో, బాగ్దాద్, అజర్బైజాన్, స్టాక్ హోమ్ నగరాలకు బెంగళూరు నుంచి తొలిసారిగా విమానాలు నడిచాయని చెప్పారు.