కనగరాజ్ ప్రమాణస్వీకారం వల్లే రాజ్ భవన్ కు కరోనా సోకిందనడం దారుణం: మంత్రి మోపిదేవి
- కరోనా దెబ్బకు అమెరికానే వణికింది
- పక్క రాష్ట్రంలో ఉండి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు
- కరోనా కిట్లపై విచారణ అవసరం లేదు
కరోనా వైరస్ దెబ్బకు అగ్రదేశం అమెరికా వణికిపోయిందని... కానీ, ఇదే సమయంలో ఆ మహమ్మారికి కళ్లెం వేయడంలో భారత్ ముందుందని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే... పక్క రాష్ట్రంలో ఉండి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న టీడీపీ నేతలు ఇళ్లలో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చిల్లర రాజకీయాలు చేస్తుండటం దురదృష్టకరమని చెప్పారు.
రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ ప్రమాణస్వీకారం చేయబట్టే రాజ్ భవన్ కు కరోనా వైరస్ సోకిందని ఆరోపణలు చేస్తుండటం దారుణమని మోపిదేవి అన్నారు. ఇలాంటి ఆరోపణలు శోచనీయమని చెప్పారు. పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసే ధరలకే తమకూ కరోనా కిట్లను సరఫరా చేయాలని సదరు కంపెనీకి ముందే స్పష్టం చేశామని... ఇప్పుడు దీనిపై విచారణ ఎందుకని ప్రశ్నించారు.