భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
- మార్చ్ 13 తర్వాత ఆ స్థాయిలో ముగిసిన మార్కెట్లు
- 606 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 172 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 606 పాయింట్లు పెరిగి 32,720కి చేరింది. నిఫ్టీ 172 పాయింట్లు ఎగబాకి 9,553 వద్ద స్థిర పడింది. మార్చి 13 తర్వాత మార్కెట్లు ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (7.07%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (4.87%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.73%), టాటా స్టీల్ (3.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.09%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్(-3.67%), ఏసియన్ పెయింట్స్ (-3.08%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.55%), నెస్లే ఇండియా (-0.41%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.13%).