ఊహూ.. ఇప్పుడు వచ్చేది లేదు.. కరోనా తగ్గేదాకా ఇండియాలోనే ఉంటామంటున్న అమెరికన్లు!
- కరోనా విజృంభణ నేపథ్యంలో స్వదేశం వెళ్లేందుకు ససేమిరా
- ప్రత్యేక విమానాల్లో సీట్లు ఖాయం చేసుకునేందుకు నిరాకరణ
- యూఎస్‌ఏలో పది లక్షల మందికి కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి విజృంభణతో అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. ఆ దేశంలో కరోనా కేసులు ఇప్పటికే పది లక్షలు దాటాయి. 59 వేల మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకున్న అమెరికన్లు తమ దేశానికి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఈ మహమ్మారి తీవ్రత తగ్గేంత వరకు మన దేశంలోనే భద్రంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన దౌత్యవేత్త ఇయాన్ బ్రౌన్లీ తెలిపారు.
అమెరికా వచ్చేందుకు ఇది వరకు పేర్లు నమోదు చేసుకున్నవాళ్లు ఇప్పుడు ప్రత్యేక విమానాల్లో సీట్లు ఖాయం చేసుకోవాలని చెబితే స్పందించడం లేదని బ్రౌన్లీ చెప్పారు. గతవారం ఇండియా నుంచి నాలుగు వేల మంది అమెరికన్లు స్వదేశానికి తిరిగివెళ్లారు. మరో ఆరు వేల మంది తమను తీసుకెళ్లే ప్రత్యేక విమానాల కోసం ఎదురు చూస్తున్నారు. సువిశాల దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ పౌరులను ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా ముంబై, ఢిల్లీకి చేరవేయడం కష్టమవుతోందని బ్రౌన్లీ చెప్పారు. గత నెల 25వ తేదీన లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం... ప్యాసింజర్ విమానాలు, రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేసిన సంగతి తెలిసిందే.