విజయవాడలో కరోనా కేసులు పెరుగుతుండటంపై జిల్లా కలెక్టర్ స్పందన
- ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదు
- కృష్ణలంక, ఖుద్దూస్ నగర్ ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి
- నిబంధనలను ఇకపై ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. విజయవాడలో కేసులు పెరుగుతున్న తీరు కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో, విజయవాడలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ, విజయవాడ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించడం లేదని చెప్పారు. కృష్ణలంక, ఖుద్దూస్ నగర్ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. ప్రజలు సామూహిక సమావేశాల్లో పాల్గొనడం వల్లే కేసులు ఎక్కువ అయ్యాయని చెప్పారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని విన్నవించారు. లాక్ డౌన్ నిబంధనలను ఇకపై ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీస్ కమిషనర్ ద్వారాకా తిరుమలరావు మాట్లాడుతూ, ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు. రెడ్ జోన్ ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసరాలను సరఫరా చేస్తామని చెప్పారు. విధినిర్వహణలో ఉన్నవారికి కూడా వైరస్ సోకిందని... 13 మంది పోలీసులకు, 12 మంది వాలంటీర్స్ కు వచ్చిందని తెలిపారు. కేసులు పెరిగే కొద్ది పోలీసు చర్యలు కఠినమవుతాయని హెచ్చరించారు.