5 గంటల పాటు ఓపికతో నిలబడి ప్రాణాలు దక్కించుకున్న జిరాఫీ... వైరల్ వీడియో!
- సౌతాఫ్రికాలోని క్రూగర్ పార్క్ లో ఘటన
- సింహాల గుంపు దాడి చేస్తే భయపడని జిరాఫీ
- వేల కొద్దీ లైక్స్ తెచ్చుకుంటున్న వీడియో
సమయస్ఫూర్తి.. దానికి తోడు సహనం వుంటే కనుక ఎంతటి ఆపదలోనైనా సరే ప్రాణాలు కాపాడుకోవచ్చనే విషయాన్ని ఓ జిరాఫీ నిరూపించింది. ఐదు గంటల పాటు ఏమాత్రం కదలకుండా.. అలాగే నిలబడి.. తన ప్రాణాలను దక్కించుకుంది. సింహాల గుంపు దాని శరీరంపై పడి దొరికిన భాగాన్ని దొరికినట్టు కొరుకుతూ ఉన్నా, ఆ బాధను ఓర్చుకుంటూ.. సహనంతో నిలబడి, ప్రాణాలతో బయటపడింది. ఆ జిరాఫీ ఎంతకూ కింద పడకపోవడంతో సింహాలు చేసేదేమీ లేక, దాన్ని వదిలేసి వెనక్కు వెళ్లిపోయాయి.
ఈ ఘటన సౌతాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ లో జరుగగా, తనకు అందిన వీడియోను ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి నవీద్ ట్రంబూ తన ట్విటర్‌లో షేర్ చేశారు. "ఈ వీడియో మనకు ఓ పాఠాన్ని నేర్పుతోంది. క్రూరంగా తనపై దాడి చేస్తున్న వేళ, 5 గంటల పాటు ఈ జిరాఫీ బెదరకుండా నిలబడిపోయింది. దేన్నైనా సాధించాలంటే ఓపిక ముఖ్యమని జిరాఫీ నిరూపించింది" అని ఆయన కామెంట్ పెట్టగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వేల కొద్దీ లైక్స్ వస్తున్నాయి. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.