అమెరికాలో మళ్లీ భారీగా పెరిగిపోతోన్న మృతుల సంఖ్య.. 24 గంటల్లో 2,207 మంది మృతి

  • ఆది, సోమవారాల్లో మృతుల సంఖ్య 1,300 కంటే తక్కువగా నమోదు
  • ప్రపంచంలో మూడింట ఒక వంతు మంది బాధితులు అమెరికాలోనే
  • అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 10,34,588
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. వియత్నాంతో జరిగిన యుద్ధంలో మరణించిన అమెరికన్ల కంటే కరోనాతో మృతి చెందిన అమెరికన్ల సంఖ్య ఎక్కువగా నమోదయిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఇప్పటి వరకు అమెరికాలో కరోనాతో 58,351 మంది మృతి చెందారని చెప్పింది.

గత 24 గంటల్లో అమెరికాలో 2,207 కేసులు కొత్తగా నమోదయ్యాయని ప్రకటించింది. ఆది, సోమవారాల్లో మృతుల సంఖ్య 1,300 కంటే తక్కువగా నమోదయిన విషయం తెలిసిందే. కాగా, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటి పోయింది. ప్రపంచంలో మూడింట ఒక వంతు మంది కరోనా బాధితులు అమెరికాలోనే ఉన్నారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య  ఇప్పటివరకు 10,34,588కి చేరింది.


More Telugu News