అగ్ని ప్రమాదంలో కెనడా ప్రధాని ట్రుడావో తల్లికి గాయాలు!

  • అపార్టుమెంట్ లో అగ్ని ప్రమాదం
  • మార్గరెట్ ట్రుడావోను ఆసుపత్రికి తరలించిన అధికారులు
  • ఇంకా స్పందించని ప్రధాని కార్యాలయం
కెనడాలోని మాంట్రియాల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రధాని జస్టిన్ ట్రుడావో తల్లి, దివంగత మాజీ ప్రధాని పెయిరీ ట్రుడావో భార్య మార్గరెట్ ట్రుడావోకు గాయాలు అయ్యాయి. ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అధికారులు పేర్కొన్నారు.

ఆపై పలు అగ్నిమాపక శకటాలు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ విషయమై ఇంకా ప్రధాని కార్యాలయం స్పందించలేదు. ప్రభుత్వ అధీనంలో పని చేస్తున్న రేడియో కెనడా మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, మార్గరెట్ ట్రుడావోను ఆసుపత్రికి తరలించారని, పొగను పీల్చిన కారణంగా ఆమె శ్వాస సంబంధిత ఇబ్బందులు పడ్డారని, కొన్ని గాయాలు కూడా అయ్యాయని పేర్కొంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. అపార్ట్ మెంట్ ఐదవ ఫ్లోర్ లో ఈ ప్రమాదం జరుగగా, 70 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మూడు కుటుంబాలను ఖాళీ చేయించాయి.


More Telugu News