సెల్‌కు చార్జింగ్ పెట్టి వీడియో కాల్.. పేలడంతో తీవ్రంగా గాయపడిన యువతి
- తమిళనాడు, తిరువారూరు జిల్లాలో ఘటన
- చెవిలోకి వెళ్లిన మొబైల్ ముక్కలు
- కంటికి తీవ్ర గాయం
సెల్‌ఫోన్‌ను చార్జింగ్‌లో పెట్టి మాట్లాడుతుండగా అకస్మాత్తుగా పేలడంతో యువతి తీవ్రంగా గాయపడిన ఘటన తమిళనాడులో జరిగింది. తిరువారూరు జిల్లా నీడామంగళం ముట్టయ్యకొత్తనార్ తందు ప్రాంతానికి చెందిన సుకుమార్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కుమార్తె ఆర్తి సోమవారం తండ్రితో వీడియో కాల్ మాట్లాడాలని అనుకుంది.
అయితే, మొబైల్‌లో చార్జింగ్ లేకపోవడంతో చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఒక్కసారిగా సెల్‌ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. మొబైల్ తునాతునకలైంది. దాని ముక్కలు ఆర్తి కళ్లలోకి, చెవిలోకి వెళ్లి బలంగా తాకాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఆమెను అక్కడి నుంచి తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమె చూపు కోల్పోయినట్టు తెలుస్తోంది.