‘కరోనా’ మరణాలపై అధ్యయనానికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ

  • ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు
  • వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో పని చేయనున్న కమిటీ
  • ఈ కమిటీలో 9 మంది అధికారులు, నిపుణులు 
ఏపీలో ‘కరోనా’ మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ బారిన పడి ఎంత మంది మరణించారన్న వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా మరణాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో పని చేసే ఈ కమిటీలో 9 మంది అధికారులు, నిపుణులు ఉంటారు. ఎన్టీఆర్ వర్శిటీ రిజిస్ట్రార్, ఫోరెన్సిక్ విభాగ ప్రొఫెసర్ సహా ఇతర నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.


More Telugu News