ఏపీలో వాహనాల రవాణా పన్ను చెల్లింపు గడువు పెంపు
- ఏపీలో వాహనదారులకు కొంత ఊరట
- జూన్ 30 వరకు గడువు పెంచుతూ నిర్ణయం
- ఈ మేరకు రవాణా శాఖాధికారులకు మంత్రి పేర్ని ఆదేశాలు
లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం నుంచి కొంత ఊరట కలిగింది. ఏపీలో వాహనాల రవాణా పన్ను చెల్లింపు గడువును జూన్ 30 వరకు గడువు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రవాణా శాఖాధికారులకు మంత్రి పేర్ని ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.