ఓ సామాజిక వర్గానికి చెందినవాళ్లు అమ్మే కూరగాయలు కొనొద్దన్న బీజేపీ ఎమ్మెల్యే... అధిష్ఠానం సీరియస్!
- కరోనా వ్యాప్తికి ఓ మతం కారణమంటూ ఇప్పటికే ఆరోపణలు
- ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలతో మరింత దుమారం
- ఇలాంటి వ్యాఖ్యలు సహించబోమన్న జేపీ నడ్డా
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన సమావేశం కారణంగానే దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమైందన్న ఆరోపణలు నేటికీ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారీ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ముస్లింలు అమ్మే కూరగాయలను కొనొద్దంటూ ప్రజలకు సూచించారు. అంతేకాదు, నేనేమైనా తప్పు చెప్పానా? అంటూ రెట్టించారు.
అయితే, ఈ వ్యాఖ్యలను బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే సురేశ్ తివారీ వైఖరి పట్ల బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని హెచ్చరించారు. అధిష్ఠానం షోకాజ్ నోటీసులు పంపింది. అంతేకాదు, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ యూపీ బీజేపీ విభాగాన్ని ఆదేశించింది.