మేం ఎంత కష్టపడినా వీళ్లింతే!: మీడియాపై ట్రంప్ అసహనం
- కరోనా కట్టడిలో తీవ్రంగా కృషి చేస్తున్నామన్న ట్రంప్
- మరే దేశం చేయనన్ని టెస్టులు చేస్తున్నట్టు వెల్లడి
- మీడియా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, అక్కడి మీడియాలోని మెజారిటీ వర్గానికి పొసగదన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
"కరోనాను అంతం చేసేందుకు మేం ఎంతో చేస్తున్నాం. ప్రపంచంలో మరే ఇతర దేశం నిర్వహించనన్ని కరోనా టెస్టులు చేపడుతున్నాం. కానీ ఈ మీడియా మాత్రం ఫిర్యాదులు చేయడం తప్ప మరే విధంగానూ స్పందించదు. మేం వెంటిలేటర్ల విషయంలో తీసుకున్న చర్యల్లోనూ మీడియాది ఇదే వైఖరి. ప్రభుత్వ చర్యలు బాగున్నాయని వాళ్లెప్పుడూ చెప్పరు. దుర్మార్గంగా దేనినో దానిని తప్పుపడుతూనే వుంటారు" అంటూ ధ్వజమెత్తారు.