నేను సాయం చేశాను, మీరూ చేయండి: నాగబాబు పిలుపు
- హెల్ప్ ఏజ్ సంస్థకు నిధులు సేకరిస్తున్నట్టు వెల్లడి
- లాక్ డౌన్ నేపథ్యంలో నిర్భాగ్యులను ఆదుకోవాలంటూ పోస్టు
- మీ సాయం తప్పక ఉపయోగపడుతుందంటూ వివరణ
సినీ నటుడు, జనసేన నేత నాగబాబు హలో ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కరోనా కష్టకాలంలో తాను నిధులు సేకరించి అభాగ్యులకు సాయపడుతున్నానని, మీరూ చేయూతనివ్వాలని కోరారు.
"హెల్ప్ ఏజ్ ఇండియా అనే దాతృత్వ సంస్థ కోసం నిధులు సేకరిస్తున్నాను. హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ లాక్ డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న కుటుంబాలకు, రోడ్లపై ఉంటున్న నిరాశ్రయులకు, నైట్ షెల్టర్లలో ఉంటున్నవారికి, మురికివాడల ప్రజలకు, దినసరి కూలీలకు నిత్యావసరాలు, రక్షణాత్మక కిట్లు, ఉచిత ఆహారం అందిస్తోంది. నిస్సహాయులకు అనేక మార్గాల్లో నా వంతు సాయం చేశాను. ఇక మీ వంతు వచ్చింది. మీరూ సాయం చేసి ఆదుకోండి. కొందరికైనా అది ఉపయుక్తంగా ఉంటుంది" అంటూ పిలుపునిచ్చారు.