15 రోజుల్లో 100 మందిని హత్య చేశారు: ప్రియాంక
- మూడు రోజుల క్రితం కూడా ఐదు మృత దేహాలను కనుగొన్నారు
- యూపీ ప్రభుత్వం వీటిపై స్పందించడం లేదు
- హత్యలపై వెంటనే దర్యాప్తు జరపాలి
గత 15 రోజుల్లో ఉత్తరప్రదేశ్ లో 100 మంది హత్యకు గురయ్యారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ఆరోపించారు. మూడు రోజుల క్రితం ఎటాలో పచౌరి కుటుంబానికి చెందిన ఐదు మృతదేహాలను పోలీసులు అనుమానాస్పద స్థితిలో కనుగొన్నారని చెప్పారు. వారికి ఏం జరిగింది, ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారనే విషయాలు ఇంత వరకు తెలియలేదని అన్నారు. ఈ హత్యలపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.