లక్షల మంది విద్యార్థులకు ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నారు: రోజా

  • వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్
  • 12 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి డబ్బులు
  • ప్రతి విద్యార్థికి సమానమైన విద్య అందుతుంది
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాల్లోనే ఈ మొత్తాన్ని జమ చేస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు.

లక్షలాది మంది విద్యార్థులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నారని రోజా కొనియాడారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 12 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు పడతాయని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి సమానమైన, న్యాయమైన విద్య అందుతుందని తెలిపారు.


More Telugu News