ఇండియాలో పెరిగిన కరోనా మరణాలు... గత 24 గంటల్లో బిగ్ జంప్!
- గత 24 గంటల్లో 62 మరణాలు
- 934కు చేరుకున్న మరణాల సంఖ్య
- 29,435కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1,543 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 62 మరణాలు సంభవించాయి. ఒక్క రోజులో ఇంత ఎక్కువగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వీటితో కలిపి దేశంలో మొత్తం మరణాల సంఖ్య 934కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,435కి చేరింది. మొత్తం 6,869 మంది పేషెంట్లు కోలుకున్నారు. రికవరీ రేటు ఈ ఉదయం 23.33గా నమోదైంది.
మరోవైపు దేశంలో నమోదైన కరోనా మరణాల్లో 80 శాతం మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. మొత్తం 934 మరణాల్లో ఈ రాష్ట్రాల్లో మృతి చెందిన వారి సంఖ్య 741గా ఉంది. మొత్తం మరణాల్లో 39 శాతం మహారాష్ట్రలోనే సంభవించాయి.