నెల్లూరు జిల్లాలో ఎస్ఐ ఓవరాక్షన్... క్షమాపణ చెప్పించిన అధికారులు!
- హైదరాబాద్ లో చిక్కుకుపోయిన జలదంకి వాసులు
- నానా ప్రయాసలు పడి స్వగ్రామాలకు చేరిక
- ఇళ్లలోకి జొరబడి ఎస్ఐ కొట్టడంతో గ్రామస్థుల ఆగ్రహం
నెల్లూరు జిల్లా జలదంకిలో ఎస్ఐ చేసిన ఓవరాక్షన్ చర్చనీయాంశం కాగా, కల్పించుకున్న ఉన్నతాధికారులు, అతనితో బాధితులకు క్షమాపణలు చెప్పించారు. వివరాల్లోకి వెళితే, లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో చిక్కుకుపోయిన కొందరు ఎలాగోలా శ్రమించి జలదంకి మండల పరిధిలోని స్వస్థలాలకు చేరుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ, వారి ఇళ్లలోకి జొరబడి, ఎందుకు వచ్చారని తిడుతూ, విపరీతంగా కొట్టాడు. దీంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎస్ఐ దాడికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఎస్ఐ వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన గ్రామస్థులు నిరసనకు దిగడంతో, విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, ఎస్ఐని పిలిపించి, బాధితులకు క్షమాపణలు చెప్పించి, వారి మధ్య రాజీ చేశారు.