ఉద్ధవ్ థాకరేను ఎమ్మెల్సీగా నియమించాలంటూ రెండోసారి తీర్మానం చేసిన 'మహా' కేబినేట్
- ఈ నెల 9న తొలిసారి తీర్మానించిన కేబినెట్
- ఆమోదించని గవర్నర్ కోష్యారీ
- మే 28 లోపు ఎమ్మెల్సీ కాకుంటే పదవి కోల్పోయే ప్రమాదం
గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీటులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను నియమించాలని కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం రెండోసారి తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని నిన్న రాత్రి గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీకి పంపినట్టు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.
ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నియమించాలంటూ ఈ నెల 9న తొలిసారి తీర్మానం చేసి, మంత్రివర్గం దానిని గవర్నర్‌కు పంపింది. అయితే, ఆ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించకపోవడంతో తాజాగా రెండోసారి తీర్మానం చేసి పంపారు. అయితే, ఈసారైనా గవర్నర్ ఆమోదిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మే 28కి ఆరు నెలలు పూర్తవుతుంది. ఆ లోపు ఉద్ధవ్ ఎమ్మెల్సీగా నామినేట్ కాకుంటే పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తప్పదు.