పోలీసులు అడ్డుకున్నారంటూ పీక కోసుకున్న వ్యక్తి.. కారణం వేరే ఉందన్న పోలీసులు
- తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఘటన
- లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బైక్‌పై బయటకు
- కుటుంబ కలహాలతోనే పీక కోసుకున్నాడన్న పోలీసులు
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డు మీదకు వచ్చిన ఓ వ్యక్తి, పోలీసులు తనను ఆపారంటూ గొంతుకోసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో సోమవారం జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన లోవరాజు బైక్‌పై వెళ్తుండగా జగ్గంపేటలో లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు.
దీంతో మనస్తాపం చెందిన లోవరాజు ఆ వెంటనే బ్లేడుతో పీక కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. లోవరాజు పీక కోసుకోవడం వెనక వేరే కారణం ఉందన్నారు. మద్యం మత్తు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడని వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.