సుప్రీంకోర్టుకూ కరోనా సెగ.. ఉద్యోగికి పాజిటివ్!

  • జుడీషియల్ విభాగంలోని ఉద్యోగికి వైరస్
  • ఈ నెల 16న విధులకు హాజరైన తర్వాత లక్షణాలు
  • సెల్ఫ్ క్వారంటైన్‌కు ఇద్దరు రిజిస్ట్రార్లు
కరోనా వైరస్ సెగ దేశ అత్యున్నత న్యాయస్థానానికీ తాకింది. కోర్టులోని జుడీషియల్ విభాగంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. ఈ నెల 16న విధులకు హాజరైన ఆయన ఆ తర్వాత రెండు రోజులపాటు జ్వరంతో బాధపడడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం నాటి రిపోర్టుల్లో అతడికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించిన అధికారులు.. ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఇద్దరు రిజిస్ట్రార్లను సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపారు. అలాగే, 16వ తేదీ నుంచి విధులకు హాజరవుతున్న ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.


More Telugu News