లాక్ డౌన్ వేళ గూగుల్ లో ఎక్కువగా వెతుకుతున్నది వీటి గురించే..!
- కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ అమలు
- ఉద్యోగాలు, రెసిపీల కోసం నెట్టింట వెతుకులాట
- సెర్చ్ రిజల్ట్స్ లో మానసిక సమస్యలు, నివారణ చర్యలకు
యావత్ ప్రపంచం కరోనాకు భయపడి లాక్ డౌన్ లో కాలం వెళ్లబుచ్చుతోంది. దీనికి అంతెప్పుడో ఎవరికీ తెలియడంలేదు. ఇప్పట్లో లాక్ డౌన్ ముగిసే సూచనలు కనిపించడంలేదు. భారత్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే, కరోనా ముందు పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే ప్రజల ప్రాధామ్యాల్లో మార్పులు వచ్చినట్టు అర్థమవుతోంది. వారు గూగుల్ లో వెతుకుతున్న అంశాలు మారిన దృక్పథాలకు నిదర్శనం. టాప్ ట్రెండింగ్స్ లో మానసిక ఒత్తిడి, నివారణ విధానాలు, ఉద్యోగ అన్వేషణలు, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టూల్స్, వంటల రెసిపీల కోసం బాగా వెతుకుతున్నట్టు గూగుల్ పేర్కొంది.
లాక్ డౌన్ కాలంలో ప్రజల్లో భయాందోళనలు, ఒత్తిళ్లు అధికం అయ్యాయన్నది వాస్తవం. ఇతర దేశాలతో పోల్చితే భారత్ లోనే ఒత్తిళ్ల గురించి అధికంగా వెతికారట. ఆందోళనలు, మానసిక పరమైన సమస్యల గురించి కూడా సెర్చ్ రిజల్ట్స్ లో పెరుగుదల కనిపించిందని ఇతర డేటాలు కూడా చెబుతున్నాయి. ఉద్యోగ అనిశ్చితి, సంబంధాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సంబంధ విషయాలతో సతమతమవుతూ మానసిక జబ్బులకు లోనవుతున్న వారి సంఖ్య 20 శాతం పెరిగిందని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ పేర్కొంది. ఇక నివారణ విధానాల గురించి వెతుకుతున్న వారిలో ఎక్కువ మంది అండమాన్ అండ్ నికోబార్ దీవులు, మిజోరాం, పుదుచ్చేరికి చెందినవారేనని గూగుల్ వెల్లడించింది.
అదృష్టవశాత్తు ఆత్మహత్యల విషయం గురించి వెతికేవాళ్ల సంఖ్య స్వల్పమేనని, జర్మనీ ఆర్థిక మంత్రి థామస్ ఆత్మహత్య తర్వాత కొంచెం పెరుగుదల కనిపించినా అది అంతవరకే పరిమితమైందని వివరించింది. ఇక, అన్నింటికంటే ప్రధానంగా ఉద్యోగాల కోసం సెర్చ్ చేయడం విపరీతమైందట. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించారు. భారత్ లోనూ అనేక సంస్థలు ఉద్యోగులను తగ్గించినట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో ఇతర దేశాల కంటే భారత్ లోనే జాబ్ సెర్చ్ అంశం ట్రెండింగ్ లోకి వచ్చిందని గూగుల్ డేటా ద్వారా తెలుస్తోంది.
అనేక సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేస్తుండడంతో, ఇంటి నుంచే పనిచేసేందుకు అవసరమైన ఆన్ లైన్ టూల్స్ గురించి వెతకడం కూడా సెర్చ్ ట్రెండ్స్ ను శాసిస్తోందని వెల్లడైంది. ఇక, లాక్ డౌన్ కారణంగా 90 శాతం మంది ఇంటికే పరిమితం కావడంతో కొత్త వంటల కోసం గూగుల్ ను శోధించినట్టు సెర్చ్ రిజల్ట్స్ చెబుతున్నాయి. వర్కౌట్లు, ఆన్ లైన్ క్లాసుల కంటే రెసిపీల గురించి వెతకడమే ఎక్కువగా ఉందట. గోవా, కర్ణాటక, డామన్ అండ్ డయ్యూ ప్రాంతాల నుంచి అత్యధికంగా సెర్చ్ లు వచ్చినట్టు గూగుల్ వివరించింది.