కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై తమకేమీ తెలియదన్న చైనా!

  • మా వద్ద ఎటువంటి సమాచారమూ లేదు
  • కరోనా విషయంలో చైనా కూడా బాధిత దేశమే
  • చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షాంగ్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై తమ వద్ద ఎటువంటి సమాచారమూ లేదని చైనా అధికారికంగా ప్రకటించింది. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షాంగ్, కిమ్ గురించి చెప్పడానికి తమ వద్ద ఏమీ లేదని వ్యాఖ్యానించారు. కాగా, కిమ్ గుండెకు శస్త్రచికిత్స జరుగగా, ఆ తరువాత ఆరోగ్యం విషమించినట్టు కథనాలు ప్రసారమైన సంగతి తెలిసిందే.

గత కొంతకాలంగా కిమ్ బయట కనిపించక పోవడంతో, ఆయనకు ఏమైందోనన్న ఆందోళన కూడా ప్రజల్లో నెలకొంది. ఇదే సమయంలో కరోనా వైరస్ విషయంలో చైనా కూడా బాధిత దేశమేనని, ఏ దేశానికి హాని చేసే ఉద్దేశం తమకు లేదని గెంగ్ షాంగ్ వ్యాఖ్యానించారు. చైనా కారణంగానే కొవిడ్-19 పుట్టిందన్న ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు.


More Telugu News