దేశంలోనే అత్యధికంగా ‘కరోనా’ టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ: సీఎం జగన్

  • ఇప్పటి వరకు 74,551 టెస్టులు చేశాం
  • రెడ్, ఆరెంజ్ జోన్లలో చేసిన పరీక్షల్లో 1.61 శాతం మాత్రమే పాజిటివ్
  • ఈ నెల రోజుల్లో టెస్టింగ్ సౌకర్యాలు పెంచుకున్నాం
దేశంలోనే అత్యధికంగా ‘కరోనా’ టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ అని సీఎం జగన్ అన్నారు. ప్రజలనుద్దేశించి ఈరోజు ఆయన ప్రసంగిస్తూ, ఇప్పటి వరకు 74,551 టెస్టులు చేశామని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ జోన్ లో 63,  ఆరెంజ్ జోన్ లో 54, గ్రీన్ జోన్ లో 559 మండలాలు ఉన్నట్టు వివరించారు.

రెడ్, ఆరెంజ్ జోన్లలో చేసిన 70 శాతం పరీక్షల్లో 1.61 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయని అన్నారు. 5 కొవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, క్వారంటైన్ సెంటర్లలో అన్ని వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల రోజుల్లో టెస్టింగ్ సౌకర్యాలు పెంచుకున్నామని, ‘కరోనా’ వైద్య పరీక్షల నిమిత్తం 9 వీఆర్డీఎల్; 44 ట్రూనాట్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. 81 శాతం మందికి ఇళ్లల్లో ఉంటేనే నయమైపోతోందని, కేవలం 14 శాతం మంది మాత్రమే ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి ఉందని చెప్పారు.


More Telugu News