నేరుగా 'ఓటీటీ'లో విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం!

  • 29న ఆన్ లైన్ లో విడుదల కానున్న 'అమృతరామన్'
  • జీ5లో విడుదల చేయనున్నామన్న యూనిట్
  • ఇంట్లోనే ఉండి సినిమాను ఎంజాయ్ చేయాలని విజ్ఞప్తి
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ అమలుచేస్తున్న వేళ, గత నెల రెండో వారం నుంచి సినిమా హాల్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ప్రజలంతా ఒకేచోట గుమికూడే ప్రాంతాలన్నీ మూసివేయబడగా, ఇప్పుడప్పుడే థియేటర్లు తెరచుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతలకు 'ఓటీటీ' తమ సినిమాల విడుదలకు ఓ ప్లాట్ ఫామ్ గా నిలువగా, థియేటర్లలోకి రాకుండా, నేరుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తొలి తెలుగు చిత్రంగా 'అమృత రామన్' నిలువనుంది.

అమితా రంగనాథ్, రామ్ మిట్టకంటి నటించిన ఈ సినిమాను 29వ తేదీన జీ5 యాప్ ద్వారా విడుదల చేయనున్నారు. కే సురేందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ ను ఇంట్లోనే ఉండి, ప్రేక్షకులు చూడవచ్చని యూనిట్ పేర్కొంది. ఇప్పటివరకూ అమ్మాయిల ప్రేమ కోసం పరితపించిన అబ్బాయిల చిత్రాలు ఎన్నో వచ్చాయని, ఈ సినిమా కథాంశం, అబ్బాయి ప్రేమ కోసం అమ్మాయి పడే వేదనను ఆవిష్కరిస్తుందని సమాచారం.


More Telugu News