ఏపీలో ఎక్కువగా కరోనా బారిన పడుతున్నది యువకులే!

  • 60.87 శాతం మంది 16 నుంచి 45 ఏళ్ల మధ్యవయస్కులే!
  • వెల్లడైన కేసుల్లో వృద్ధుల శాతం తక్కువేనంటున్న నివేదిక
  • ఇప్పటివరకు ఏపీలో 1177 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,177 కాగా, ఇప్పటివరకు 31 మంది మరణించారు. కర్నూలు (292), గుంటూరు (237), కృష్ణా (210) జిల్లాల్లో రెండొందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఓ నివేదికలో ఆశ్చర్యకరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఏపీలో ఎక్కువగా కరోనా బారిన పడుతున్నది యువకులేనని తేలింది. ఇప్పటివరకు గుర్తించిన కరోనా బాధితుల్లో 16 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులు 60.87 శాతం మంది ఉన్నారు. కరోనా బారిన పడిన 60 ఏళ్లు పైబడిన వృద్ధుల శాతం కేవలం 11.12 మాత్రమే. 15 ఏళ్ల లోపు వారి శాతం 6.54 కాగా, 46 నుంచి 60 ఏళ్ల వ్యక్తుల శాతం 21.48గా ఉంది.


More Telugu News