లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన.. కుప్పిగంతులు వేయించిన పోలీసులు!
- కర్నూలు జిల్లా పోలీసుల వినూత్న చర్యలు
- అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారితో కుప్పిగంతులు
- అనంతపురం జిల్లా ధర్మవరంలోనూ పోలీస్ చర్యలు
- నిబంధనలు ఉల్లంఘించిన వారిని క్వారంటైన్ కు తరలింపు
కర్నూలు జిల్లాలో ‘కరోనా’ కట్టడికి పోలీసులు తమ దైన శైలిలో వ్యవహరిస్తున్నారు. గాజులపల్లిలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు వినూత్న రీతిలో చర్యలు చేపడుతున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారితో కుప్పిగంతులు వేయిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వారిని అదుపులోకి తీసుకుని అంబులెన్స్ లలో వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రమాకాంత్ మాట్లాడుతూ, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించినా మాట వినడం లేదని అన్నారు. రోడ్లపైకి రావొద్దని అన్ని విధాలా ప్రజలకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని క్వారంటైన్ కు తరలించాలని ఈరోజే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు పది మందిని క్వారంటైన్ కు తరలించినట్టు చెప్పారు.