లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనలను నిలువరించాలి: కేంద్ర మంత్రి అమిత్ షా

  • ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అమిత్ షా 
  • రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా మాట్లాడినట్టు సమాచారం
  • లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచన
‘కరోనా’ నివారణ నిమిత్తం దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన జరగకుండా నిలువరించాలని ముఖ్యమంత్రులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సూచించారు. ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని ముఖ్యమంత్రులతో మాట్లాడినట్టు తెలిసింది. దేశంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని, ఇది దీర్ఘకాలిక పోరాటం అని, నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.

ఈ పోరాటంలో ఓపిక అవసరమని సీఎంలకు ఆయన సూచించినట్టు సమాచారం. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సామాజిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ‘కరోనా’ విషయంలో  ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో పరిస్థితి బాగుందని అమిత్ షా అన్నట్టు తెలిసింది. ఆర్థిక కార్యకలాపాలను ఎక్కువ కాలం ఆపలేమని, అందుకే, కొన్నింటికి అవకాశం కల్పించామని అన్నారు.


More Telugu News