విజయ్‌ దేవరకొండతో నటించాలనుంది: పాయల్ రాజ్‌పుత్

విజయ్‌ దేవరకొండతో నటించాలనుంది: పాయల్ రాజ్‌పుత్
  • కార్తికేయతో డేటింగ్‌ చేయాలనుకోవడం లేదు
  • మేమిద్దరం మంచి స్నేహితులం
  • ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో అభిమానుల ప్రశ్నలకు పాయల్ జవాబులు
‘ఆర్ఎక్స్‌ 100’ చిత్రంతో టాలీవుడ్‌లో సంచలన అరంగేట్రం చేసిన నటి పాయల్‌ రాజ్‌పుత్. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ పాయల్‌ ఎక్కువ అవకాశాలు దక్కించుకోవడంలో వెనుకబడింది. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఆమె మంచి చిత్రాలతో ముందుకు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న పాయల్‌ను తెలుగులో ఎలాంటి చిత్రాలు చేస్తున్నారో చెప్పమని ఫ్యాన్స్ పదే పదే అడిగారు. కానీ, పాయల్ మాత్రం స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు.  

తెలుగులో మీరు ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారని ఓ అభిమాని ప్రశ్నిస్తే.. వెంటనే విజయ్ దేవరకొండ అని చెప్పింది. అలాగే, తన మొదటి చిత్రం హీరో కార్తికేయతో డేటింగ్ చేస్తారా? అని పాయల్‌ను మరో అభిమాని ప్రశ్నించాడు. అలాందేమీ లేదన్న నటి.. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పింది.


More Telugu News