కరోనా కిట్ల స్కాంకు పాల్పడిన వారిపై మోదీ చర్యలు తీసుకోవాలి: రాహుల్ గాంధీ

  • టెస్టింగ్ కిట్లను 145 శాతం అధిక ధరలకు కొన్నారంటూ  ఆరోపణలు
  • ఈ కుంభకోణం ప్రతి భారతీయుడికి అవమానం లాంటిది 
  • అవినీతిపరులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్
కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ల కొనుగోళ్ల అంశం రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. వాస్తవ ధర కంటే 145 శాతం అధిక ధరకు కిట్లను కొనుగోలు చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, తన లక్షలాది సోదర సోదరీమణులు పడుతున్న అంతులేని బాధ ద్వారా లాభం పొందాలని ఎవరైనా ప్రయత్నించడం అనేది నమ్మలేనిది. ప్రతి భారతీయుడికీ ఇది అవమానకరం' అన్నారు.
 
ఈ కుంభకోణం విషయంలో ప్రధాని మోదీ తక్షణమే స్పందించాలని... స్కామ్ లో పాలుపంచుకున్న అవినీతిపరులను చట్టం ముందు నిలబెట్టాలని ప్రధాని మోదీని కోరుతున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News