సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా మార్కెట్‌కు జనం.. వీడియో ఇదిగో

  • కోల్‌కతాలోని రాజా బజార్‌లో ఘటన
  • నిబంధనలు గాల్లో వదిలేసిన ప్రజలు
  • పలు ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తోన్న పోలీసులు
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం జనం గుంపులు గుంపులుగా కనపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని రాజా బజార్‌లో ఈ రోజు ఉదయం కూరగాయల మార్కెట్‌ వద్ద జనాలు గుంపులు గుంపులుగా కనపడ్డారు. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇటువంటి పరిస్థితే కనపడింది.
                
నిబంధనలు ఉల్లంఘించి వస్తున్నవారిని కరోనా వేషధారణలో వున్న పోలీసులు, వాలంటీర్లు భయపెట్టగా ద్వారకలో స్థానికులు వెనక్కితిరిగి పరుగులు తీశారు.  

           
             
కాగా, పలు ప్రాంతాల్లో సైనికులు, పోలీసులు, వాలంటీర్లు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్ 136 బెటాలియన్‌ జవాన్లు ఈ రోజు అసోంలోని నల్బరీ జిల్లా బలికరియా గ్రామంలో స్థానికులకు మాస్కులు, ఫినాయిల్, శానిటైజర్లను పంపిణీ చేశారు.  

                
మణిపూర్‌లోని తౌబల్ మార్కెట్‌లో కూరగాయలు, పండ్ల మార్కెట్‌లో ప్రజలు నిబంధనలు ఉల్లంఘించకుండా ఆదర్శంగా నిలిచారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.


More Telugu News