కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను ముమ్మరం చేశాం: బిల్ గేట్స్

  • అనుకున్న విధంగా అన్ని పనులు జరిగితే ఏడాది లోపే వ్యాక్సిన్ తయారీ
  • కుదరకపోతే రెండేళ్ల లోపు కరోనాకు మందు  
  • వ్యాక్సిన్ ఉత్పత్తి సెప్టెంబరులో ప్రారంభం కాదు
  • కరోనా పరీక్ష ఫలితాలు 24 గంటల లోపు రావాలి
కరోనాను అంతమొందించేందుకు వ్యాక్సిన్ రూపకల్పనలో ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రకటన చేశారు. అనుకున్న విధంగా అన్ని పనులు జరిగితే ఏడాది లోపే వ్యాక్సిన్ తయారీని మొదలు పెట్టనున్నామని చెప్పారు.

ఒకవేళ ఇది కుదరకపోతే రెండేళ్ల లోపు కరోనాకు మందు కనుక్కోవడానికి సమయం పట్టవచ్చని చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సెప్టెంబరులో ప్రారంభం కాదని ఆయన అన్నారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు ఎన్నో ప్రయత్నాలతో శర వేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు.

వ్యాక్సిన్ తయారీతో పాటు, వేగంగా తయారీ ప్రక్రియపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. అమెరికాలో అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై బిల్‌గేట్స్ స్పందిస్తూ... అనవసర వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారని చెప్పారు. 24 గంటల లోపు పరీక్ష ఫలితాలు రావాలని, లేదంటే ప్రయోజనం ఉండదని తెలిపారు.


More Telugu News