ఆమె చివరి ప్రదర్శనే.. మానవ జాతికి ముగింపు వేడుక అని తెలుసుకోలేకపోయాం: ఆర్జీవీ
- ఫిబ్రవరిలో జరిగిన సూపర్ బౌల్ టోర్నీ ఆరంభ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చిన పాప్ సింగర్ షకీరా
- లాక్‌డౌన్‌కు ముందు ఇదే చివరి వేడుక
- దాన్ని కరోనాతో ముడిపెట్టి ట్వీట్ చేసిన ఆర్జీవీ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్‌పై మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. కొలంబియా పాప్ సింగర్ షకీరా లాక్‌డౌన్‌కు ముందు ఇచ్చిన చివరి ప్రదర్శనే మానవ జాతి ఉనికి ముగింపునకు చివరి వేడుక అని చమత్కరించారు. అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ ఫైనల్ ఈవెంట్ అయిన ‘సూపర్ బౌల్ 2020’ టోర్నీ ప్రారంభోత్సవంలో షకీరా ప్రదర్శన ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
ఆ తర్వాత కరోనా వ్యాప్తి పెరగడంతో చాలా దేశాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో షకీరా ప్రదర్శనకు, కరోనా వైరస్‌కు ముడిపెడుతూ ఆర్జీవీ సరదా ట్వీట్ చేశారు. ‘మనం ఎంత బుద్ధి తక్కువ వాళ్లం అంటే, లాక్‌డౌన్‌కు ముందు షకీరా ఇచ్చిన సూపర్ బౌల్ 2020 చివరి ప్రదర్శనే మానవ జాతి ఉనికికి ముగింపు వేడుక అని గుర్తించలేకపోయాం’ అని ట్వీట్ చేశారు. సూపర్ బౌల్ ప్రారంభ వేడుకల్లో షకీర నృత్య ప్రదర్శన వీడియోను కూడా షేర్ చేశారు.