నటన పట్ల నాకు పెద్దగా ఆసక్తి వుండేది కాదు: నయనతార
- మలయాళంలో ముందుగా ఛాన్స్ వచ్చింది
- తొలి సినిమానే మంచి గుర్తింపు తెచ్చింది
- కెరియర్లో వెనుదిరిగి చూసుకోలేదన్న నయన్
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా నయనతారకి విపరీతమైన క్రేజ్ వుంది. విభిన్నమైన పాత్రలను .. బరువైన పాత్రలను పోషించి, మెప్పించడంలో తనకి తానే సాటి అనిపించుకుంది. అలాంటి నయనతార ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆరంభంలో నటన పట్ల తనకి పెద్దగా ఆసక్తి ఉండేది కాదని చెప్పడం విశేషం.
"మొదటి నుంచి కూడా నాకు సినిమాలపై ఇష్టం ఉండేది కాదు. నటనపై అసలే ఆసక్తి ఉండేది కాదు. మోడలింగ్ మాత్రం చేసే దానిని. అలాంటి పరిస్థితుల్లోనే ఓ మలయాళ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే నేను చేయననే వాళ్లతో చెప్పాను. అయినా వాళ్లు వదలకుండా నన్ను ఎన్నో రకాలుగా రిక్వెస్ట్ చేశారు. ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వరుసగా ఎనిమిది సినిమాలు చేసే అవకాశం లభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కెరియర్ పరంగా వెనుదిరిగి చూసుకున్నది లేదు" అని చెప్పుకొచ్చింది.