మూడోసారి జోడీ కడుతున్న రాజ్ తరుణ్, అవికా గోర్

  • 'ఉయ్యాలా జంపాలా'తో కుదిరిన జోడీ
  • 'సినిమా చూపిస్త మావ'తో మరో హిట్
  • మూడో సినిమాకి సన్నాహాలు  
రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా కొంతకాలం క్రితం వచ్చిన 'ఉయ్యాలా జంపాలా' సినిమా భారీ విజయాన్ని సాధించింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ ప్రేమకథకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఇద్దరి కెరియర్ కి ఈ సినిమా మంచి హెల్ప్ అయింది. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సినిమా చూపిస్త మావ' కూడా బాక్సాఫిస్ దగ్గర భారీ వసూళ్లనే రాబట్టింది.

ఆ తరువాత ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ వెళుతున్నారు. రాజ్ తరుణ్ కి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక అవికా గోర్ కొన్ని కారణాల వలన గ్యాప్ తీసుకుంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. గతంలో రాజ్ తరుణ్ హీరోగా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'ను తెరకెక్కించిన శ్రీనివాస్ గవిరెడ్డి, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.


More Telugu News