లాక్ డౌన్ ను పొడిగించేందుకే మోదీ మొగ్గు... కొన్ని వెసులుబాట్లు కూడా!
- సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్
- లాక్ డౌన్ పై అభిప్రాయాలు చెప్పిన 9 మంది సీఎంలు
- క్షేత్రస్థాయి పరిస్థితుల మదింపు తరువాతే తుది నిర్ణయం
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, వారందరి అభిప్రాయాలనూ స్వీకరించిన తరువాత లాక్ డౌన్ ను మే 3 తరువాత పొడిగింపునకే మొగ్గు చూపారని తెలుస్తోంది. అధికార వర్గాల నుంచి అందుతున్న సంకేతాల మేరకు కొన్ని నిబంధనల సడలింపులు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సమావేశంలో 9 మంది ముఖ్యమంత్రులు ప్రధానితో లాక్ డౌన్ పై తమ అభిప్రాయాలు పంచుకున్నారని తెలుస్తోంది.
వీరిలో అత్యధిక మంది సీఎంలు లాక్ డౌన్ ను పొడిగించాలని, అయితే, నిత్యావసరాలతో పాటు మరిన్ని విభాగాలను అనుమతించాలని సూచించినట్టు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలనూ తీసుకున్న నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు నగరాల్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మదింపు చేసిన కేంద్ర బృందాల అభిప్రాయాలను తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
లాక్ డౌన్ కొనసాగించాల్సిన ప్రాంతాలు, గ్రీన్ జోన్ ప్రాంతంలో అనుమతించాల్సిన కార్యకలాపాలు, ప్రజా రవాణా ప్రారంభిస్తే, తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై నిర్ణయం తీసుకునే ముందు, మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసి, కేసుల స్థితిని పరిశీలించాల్సి వుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.