ఏపీలో భారీగా పెరిగిపోతోన్న కరోనా కేసులు.. మరో 80 మందికి పాజిటివ్ నిర్ధారణ

  • గుంటూరులో కొత్తగా 23, కృష్ణా జిల్లాలో 33 కేసులు
  • కరోనా కేసుల సంఖ్య  మొత్తం 1,177
  • కర్నూలులో అత్యధికంగా 292 కేసులు
  • చికిత్స పొందుతున్న వారి సంఖ్య 911
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య ప్రతి రోజు భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా మరో 80 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. కర్నూలులో కొత్తగా 13, గుంటూరులో 23, కృష్ణా జిల్లాలో 33, పశ్చిమ గోదావరిలో 3, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 7 కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరంలో మాత్రమే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  మొత్తం 1,177కి చేరింది. కర్నూలులో అత్యధికంగా 292, ఆ తర్వాత గుంటూరులో 237 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 911గా ఉంది. 235 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  

జిల్లాల వారీగా వివరాలు..                



More Telugu News