లాక్డౌన్ పొడిగించండి: వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీని కోరిన కొందరు సీఎంలు
- కొవిడ్-19 వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలుపై చర్చ
- ఆంక్షల సడలింపు లేక కొనసాగింపుపై సలహాలు తీసుకుంటున్న మోదీ
- ఎఫ్ఆర్బీఎం పరిమితి, ఆర్థిక సాయంపై చర్చ
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. కొవిడ్-19 వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలు, ఇప్పటివరకు విధించిన ఆంక్షల సడలింపు లేక కొనసాగింపు వంటి అంశాలపై కీలక చర్చలు జరుగుతున్నాయి. లాక్డౌన్ను దశలవారీగా ఎత్తివేసే విషయంపై కూడా చర్చిస్తున్నారు.
మే 3 తరువాత కూడా లాక్డౌన్ను కొనసాగించాలని ఈ సందర్భంగా మోదీని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు. అలాగే, ఎఫ్ఆర్బీఎం పరిమితి, ఆర్థిక సాయం వంటి అంశాలను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తావించారు. దశలవారీగా లాక్డౌన్ ఎత్తేయాలని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.