పవన్ చారిత్రక చిత్రంలో శివకార్తికేయన్
- క్రిష్ నుంచి భారీ చారిత్రక చిత్రం
- లాక్ డౌన్ తరువాత సెట్స్ పైకి
- కథానాయికగా తెరపైకి నివేదా పేతురాజ్ పేరు
తమిళంలో దూసుకుపోతున్న యువ కథానాయకుల రేసులో శివకార్తికేయన్ కూడా కనిపిస్తాడు. తమిళనాట శివకార్తికేయన్ కి మంచి మాస్ ఇమేజ్ వుంది. 'రెమో' .. 'సీమరాజా' సినిమాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. అలాంటి శివకార్తికేయన్, నేరుగా తెలుగు సినిమాలో చేయనున్నట్టు తెలుస్తోంది .. అదీ ఒక కీలకమైన పాత్రలో.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. మొఘల్ చక్రవర్తుల కాలానికి సంబంధించిన చారిత్రక నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో యంగ్ హీరో చేయవలసిన ఒక కీలకమైన రోల్ ఉందట. ఆ పాత్రకి శివకార్తికేయన్ అయితే బాగుంటుందని భావించి, ఆయనను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కథానాయికలుగా జాక్విలిన్ .. నివేదా పేతురాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.