బయటి నుంచి తెచ్చే మాంసాహారాన్ని అనుమతించం: గాంధీ ఆసుప్రతి కీలక ప్రకటన
- ప్రారంభమైన రంజాన్ మాసం
- ఇఫ్తార్ కోసం మాంసాహారం తీసుకురావద్దన్న గాంధీ యాజమాన్యం
- డ్రైఫ్రూట్స్, పండ్లు తీసుకురావచ్చు
ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మాసంలో ఉపవాసం ఉండేవారు... సాయంత్రం దీక్ష ముగిసిన తర్వాత మాంసాహారం తీసుకోవడం ఆనవాయతీ. మరోవైపు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు రంజాన్ మాసం సందర్భంగా మాంసాహారాన్ని కూడా అందిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ క్రమంలో హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసం సందర్భంగా రోగులకు బయటి నుంచి తెచ్చే మాంసాహారాన్ని అనుమతించబోమని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు తెలిపారు. చికిత్స పొందుతున్న వారికి మాంసాహారానికి బదులు డ్రైఫ్రూట్స్, పండ్లు తీసుకురావాలని సూచించారు. బాధితులకు వెజ్ బిర్యానీ, కిచిడీ, డ్రైఫ్రూట్స్, గుడ్దు ప్రతి రోజు ఇస్తున్నామని చెప్పారు. మసాలాలు, మాంసాహారం వల్ల ఇతర సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.